Thursday, May 16, 2024

‘దీపిక’ బ్యాగ్ ని లాగిన ఫ్యాన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే బ్యాగ్ ని లాగేశారట. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. డిన్నర్ కోసం ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వచ్చింది దీపిక. ఆమె వచ్చిన విషయం తెలుసుకున్న జనం రెస్టారెంట్ ను చుట్టు ముట్టేశారు. డిన్నర్ ముగించి  బయటకు వస్తున్న దీపిక చుట్టూ మూగేశారు. జనాల మధ్య నుంచి బాడీగార్డుల సహాయంతో దీపిక కారు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఓ మహిళా అభిమాని దీపిక హ్యాండ్ బ్యాగ్‌ను లాగేసింది. తిరిగి తన బ్యాగ్‌ను వెనక్కి తీసుకున్న దీపిక కామ్‌గా కార్ ఎక్కి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement