Monday, April 29, 2024

వైరల్ అవుతోన్న ‘ఉప్పెన’ మేకింగ్ వీడియో

హీరోగా వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉప్పెన మేకింగ్ వీడియో తెగవైరల్ అవుతోంది. ఉప్పెన చిత్రం నిర్మాణ సంస్థ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ సినిమా..పాటలను ఎలా తెరకెక్కించారు..షూటింగ్ ఎలా జరిగింది..సెట్ లోని సందడి తదితర విషయాలను ఈ వీడియోలో చూపించారు. ఉప్పెన సినిమా టాలీవుడ్‌కు కొత్త జోష్‌ను ఇచ్చింది. రికార్డు కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి హీరోహీరోయిన్లుగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూపొందించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. వంద కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా సాగిపోతోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement