Saturday, May 25, 2024

‘జగమే తంతిరమ్’ టీజర్ రిలీజ్

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న జగమే తంతిరమ్ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు నెట్ ప్లిక్స్ వారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ప్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీ పద్దతిలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.  ఇది ధనుష్ కెరీర్ లో 40వ సినిమాగా రూపొందింది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ”జగమే తంత్రం” అనే టైటిల్ తో రాబోతోంది. తాజాగా ‘జగమే తంతిరమ్’ చిత్ర టీజర్ ని నెట్ ఫ్లిక్స్ వారు విడుదల చేశారు. టీజర్ లో ధనుష్ ని సురులి అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు.  అక్కడి గ్యాంగ్ స్టర్స్ తో డీల్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ఇందులో చూపించారు. ధనుష్ ఎప్పటిలాగే తనదైన శైలి స్క్రీన్ ప్రెజన్స్ మరియు డ్యాన్స్ తో అలరించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ‘జగమే తంతిరమ్’ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement