Monday, May 13, 2024

కుమారైతో ‘సత్య’ స్టెప్పులు

తన కుమారైతో కలిసి స్టెప్పులేశారు కమెడియన్ సత్య. యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తోన్న గాలి సంపత్ చిత్రంలో రాజేంద్రప్రసాద్..కమెడియన్ సత్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫిఫిఫీ ఫిఫిఫీ క్రేజీ డాడీ అని సాగే పాటకు మాంచి స్పందన వస్తోంది.  శ్రీవిష్ణు-రాజేంద్రప్ర‌సాద్ మ‌ధ్య స‌ర‌దాగా సాగే ఈ పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అయితే ఇదే పాట‌కు క‌మెడియ‌న్ స‌త్య త‌న కూతురుతో క‌లిసి స్టెప్పులేశాడు. పెంట్‌హౌజ్ పై ఫిఫిఫీ పాట‌కు స‌త్య‌, కూతురు ఇద్ద‌రూ క‌లిసి చేసిన  ఫ‌న్నీ డ్యాన్స్ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement