Friday, May 10, 2024

‘విరాటపర్వం’ నుంచి లిరికల్ సాంగ్

యంగ్ హీరో రానా..సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం విరాటపర్వం. ఈ మూవీ నుంచి కోలు కోలమ్మా ఫుల్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నాడు. ఈ పాట లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. కోలు ‌కోల‌మ్మా కోలో కోలో నా సామి..మ‌నసే మేలు కొని చూసే..క‌ల‌లో నిండినవాడే క‌నుల ముంద‌ర ఉంటే నూరేళ్లు నిదురా రాదులే అంటూ ప‌ల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో సాయిప‌ల్ల‌వి త‌న ప్రియుడిని ఊహించుకుంటూ  పాడుకుంటున్న పాట అద్బుత‌మైన లిరిక్స్ తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది.సాయిప‌ల్ల‌వి లంగావోణిలో  గుమ్మంలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రియుడి కోసం ఎదురుచూస్తూ..అత‌న్ని ఊహించుకుంటూ పాడుకుంటున్న పాట‌కు మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఫిదా అయ్యేలా ఉంది. చంద్ర‌బోస్ రాసిన ఈ పాట‌ను దివ్య మాలిక‌, సురేశ్ బొబ్బిలి పాడారు. వేస‌వి కానుకగా ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుందీ చిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement