Thursday, May 30, 2024

Nathalia : క‌విస్తున్న బ్రెజిలీయ‌న్ భామా…

ఆర్జీవీ డిస్క‌వ‌రీ న‌థాలియా కౌర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డు తెర‌కెక్కించిన‌ ‘డిపార్ట్ మెంట్’ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌యమైంది. బ్రెజీలియ‌న్ మోడ‌ల్ కం న‌టి న‌థాలియా హిందీ చిత్ర‌సీమ‌లో కెరీర్ ఆరంభ‌మే వేడెక్కించే హొయ‌లుతో మ‌తులు చెడ‌గొట్టింది. పంజాబీ మూలాలున్న ఈ బ్యూటీ అటుపై ప్రాంతీయ భాషా చిత్రాల్లోను న‌టించింది అయితే న‌థాలియాను తెర‌కు ప‌రిచ‌యం చేసిన ఆర్జీవీ వ‌ల్ల త‌న‌కు క‌లిసొచ్చిందేమీ లేదు.

- Advertisement -

రానా దగ్గుబాటితో డిపార్ట్ మెంట్ ఫ్లాప‌వ్వ‌డంతో అటుపై ఏదీ త‌న‌కు క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ఆశించిన కెరీర్ ద‌క్క‌క‌పోవ‌డంతో తిరిగి మోడలింగ్ కే ప‌రిమిత‌మైంది నథాలియా ట్యాలెంట్ ప‌రంగా ఆల్ రౌండ‌ర్. టాప్ మోడ‌ల్.. న‌టి..డాన్సర్.. సింగర్.. రైటర్.. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్! అన్ని అర్హ‌త‌లు త‌న‌కు ఉన్నాయి. నథాలియా కౌర్ ప్ర‌త్యేక‌త ఏమిటి? అంటే.. బ్రెజిలియన్ బాడీ.. అంద‌మైన పంజాబీ ముఖంతో యూత్ ని క‌వ్వించే సొగ‌సు అని భావించాలి.

న‌థాలియా సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ.. భారీ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చింది. న‌థాలియా 3డి బ్రాలెట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బ్లూ – రెడ్ – ఆరెంజ్ క‌లర్స్ మెర్జ్ చేసిన బ్రాలెట్ లో గులాబీ రేకుల‌ను త‌ల‌పించే డిజైన‌ర్ ఎంబ్రాయిడ‌రీ ఎంతో అందంగా కుదిరింది. ఇక ప‌ట్టీల‌తో డిజైన్ చేసిన బాట‌మ్ వేర్ మ‌రింత స్పెష‌ల్ అని చెప్పాలి. ముఖ్యంగా న‌థాలియా టోన్డ్ లెగ్స్ .. ఆయిలీ శ‌రీరం ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement