Wednesday, May 22, 2024

IPL : గుజరాత్ కు నేడు చావో రేవో…కెకెఆర్ ఢీ…

ఐపీఎల్ సీజన్ 2024 చివరి దశకు వచ్చింది. ప్లే ఆఫ్ లో నిలిచేవి ఏవి? పక్కకు వెళ్లిపోయేవి ఏవనేది తేలిపోయే సమయం వచ్చేసింది. అయితే నేడు గుజరాత్ వర్సెస్ కోల్ కతా మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ రాత్రి 7.30 కి జరగనుంది. ఇందులో ఒక విశేషం ఉంది.


అదేమిటంటే గుజరాత్ గానీ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే చాప చుట్టుకుని ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పుడు తనకి జీవన్మరణ పోరుగా మారింది. కోల్ కతా కి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రడీ తను ప్లే ఆఫ్ కి చేరిపోయింది. ఇప్పుడు జరిగే మ్యాచ్ లన్నీ బోనస్ అని చెప్పాలి.

కోల్ కతా ఇంతవరకు 12 మ్యాచ్ లు ఆడింది. అందులో 9 గెలిచి నెంబర్ వన్ స్థానంలో ఉంది. అదే గుజరాత్ విషయానికి వస్తే 12 మ్యాచ్ లు ఆడి 5 మాత్రమే గెలిచి 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ రెండు గెలిస్తే, కోల్ కతా ఒకటి గెలిచింది.

- Advertisement -

కోల్ కతా విషయానికి వస్తే అందరూ బాగా ఆడుతున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగు అంతా సమతూకంగా ఉంది. అందుకే వరుసపెట్టి మ్యాచ్ లు గెలుస్తున్నారు. బ్యాటింగ్ చేసినప్పుడు స్కోరు తక్కువైనా, బౌలర్లు మ్యాచ్ నిలబెడుతున్నారు.

ఒకవేళ స్కోరు ఎక్కువైతే బ్యాటర్లు తమ బ్యాట్లకు పనిచెప్పి మ్యాచ్ లు గెలిపిస్తున్నారు. ఇంతవరకు ముంబై, ఆర్సీబీలా హెచ్చులకు పోకుండా కూల్ గా విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా అద్భుతంగా ఆడుతోంది.

ఇక గుజరాత్ విషయానికి వస్తే కెప్టెన్ గిల్ ఎట్టకేలకు గత మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చి సెంచరీ కొట్టాడు. తనతో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా సెంచరీ చేశాడు. మరి వీరిద్దరూ అదే ఫామ్ కొనసాగిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ కి చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఇది. అందుకే సీరియస్ గా ఆడుతారని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement