Monday, May 13, 2024

కుక్కపిల్లకి నరుటో అని పేరు పెట్టాం..

హీరో సోనూసూద్ తనయుడు అలీబాగ్ వీధిలో ఒంటరిగా ఉన్న ఓ కుక్కపిల్లను దత్తత తీసుకున్నాడు. దాంతో సోనూసూద్ కూడా ఆ కుక్కపిల్లకి ఆహ్వానం పలికారు.  జంతు ప్రేమను కూడా    చాటుకున్న సోనూసూద్‌ను   నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మనుషులకే కాదు మూగజీవాలకు కష్టం వస్తే ఆదుకోవడంలో సోనూ ఎప్పుడూ ముందుంటాడని ప్రశంసిస్తున్నారు. ‘నా తనయుడు అలీబాగ్ వీధుల్లో ఒంటరిగా ఉన్న ఈ కుక్క పిల్లను దత్తత తీసుకున్నాడు. ఆ కుక్క పిల్లకు నరుటో అని పేరుపెట్టామని’ సోనూసూద్‌ ట్వీట్‌ చేశాడు. తన తనయుడు కుక్కపిల్లను ఎత్తుకొని ఉండగా పక్కనే ఉండగా తీసిన ఫొటోను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌కు ఇప్పటికే 45వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement