Monday, April 29, 2024

యస్ బ్యాంక్ లాభం 1066కోట్లు, 2018-19 తరువాత తొలిసారి

గత ఆర్థిక సంవత్సరానికి రూ.1,066 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్టు యస్ బ్యాంక్ ప్రకటించింది. 2018-19 తరువాత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద మళ్లి లాభాలు ఆర్జించడం ఇదే తొలిసారి. 2019-20లో రూ.22,715 కోట్ల భారీ నష్టం, 2020-21లో రూ.3,462 కోట్ల నికర నష్టాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.367 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.3,788 కోట్ల నష్టాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. 2021అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి రూ.266 కోట్ల నికర లాభంతో పోల్చినా.. ఈసారి 38 శాతం పెరిగింది.

సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.5,829.22 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.4,678 కోట్లుగా నమోదైంది. 2021-22లో డిపాజిట్లు, రుణాల పంపిణీలో బలమైన వృద్ధి నమోదు చేసినట్టు బ్యాంక్‌ తెలిపింది. 2021-22లో అన్ని విభాగాల్లో కలిపి రూ.70,000 కోట్ల రుణాలు పంపిణీ చేసినట్టు పేర్కొంది. అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, జూన్‌ ఆఖరుకల్లా రూ.27,976 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులను దానికి బదిలీ చేస్తామని యెస్‌ బ్యాంక్‌ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement