Friday, April 26, 2024

టాటా మోటార్స్‌ అవిన్యా, 30 నిమిషాల్లో ఫుల్‌ చార్జింగ్‌

ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ పెరిగింది. వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టాటా మోటార్స్‌ తన సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు అవిన్యాను ఆవిష్కరించింది. అవిన్యా పేరుతో ఈ కొత్త ఎస్‌యూవీ ఈవీ కారును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ అవిన్యా ఎలక్ట్రిక్‌ కారు అదరగొడుతున్నది. స్మార్ట్‌ లుక్‌లో దర్మనం ఇస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ కారు 2025 నాటికి మార్కెట్లు తీసుకొస్తున్నట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది. సరికొత్త ఫ్యూర్‌ ఈవీ థర్‌ ్డ జనరేషన్‌ ఆర్కిటెక్చర్‌ను ఆధారంగా చేసుకుని టాటా అవిన్యా రూపొందించినట్టు తెలిపింది. ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ అవుతుంది. ఆల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యానికి సపోర్టు ఇచ్చేలా ఈ కారు బ్యాటరీ ఉంటుంది. 30 నిమిషాల చార్జింగ్‌కు కనీసం 500 కి.మీ దూరం వరకు ప్రయాణించగలదు.

ఈ కారుకు ఆకర్శణీయమైన ఎల్‌ఈడీ లైట్లు టీ ఆకారంలో ఉంటాయి. కంపెనీ ముందు వైపు పెద్ద బ్లాక్‌ ప్యానెల్‌ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ కారును.. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నట్టు టాటా మోటార్స్‌ తెలిపింది. సేఫ్టీ, సెక్యూరిటీలో ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ అత్యంత శక్తివంతమైందని, ఇందులో డస్ట్‌ ప్రొటెక్షన్‌ కోసం అడ్వాన్స్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ కూడా రూపొందించినట్టు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement