Tuesday, April 30, 2024

Follow up : లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంట్రాడేలో 500 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. దిగ్గజ కంపెనీలు, బ్యాంక్‌ల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. నష్టాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా ప్యూచర్‌ మార్కెట్లు రాణించడం, ఐరోపా మార్కెట్లు సానుకూల ప్రాంభం మార్కెట్లకు కలిసివచ్చింది. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో షోరూమ్‌లు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా షేర్లు సోమవారం స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌య్యాయి. ఇష్యూధర 59తో పోల్చితే 53 శాతం ప్రీమియంతో 90 రూపాయల వద్ద లిస్టయ్యింది. చివరకు 43.22 శాతం లాభంతో 84.50 వద్ద స్ఠిరపడింది.

సెన్సెక్స్‌ 491.01 పాయింట్ల లాభంతో 58410.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 126.10 పాయింట్ల లాభంతో 17311.80 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 254 రూపాయలు పెరిగి 50514 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 784 రూపాయలు పెరిగి 55950 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.29 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు

ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతి సుజుకీ, అల్ట్రాసిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

నష్టపోయిన షేర్లు

ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, సిప్లా , నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement