Saturday, April 27, 2024

క్రిఎ్టోలకు భారత్‌ సరైన వేదికకాదు..

క్రిఎ్టో కరెన్సీపై భారత్‌ అవలంబిస్తున్న విధానాలు కొన్ని అంతర్జాతీయ క్రిఎ్టో ఎక్చ్సేంజీలకు నచ్చడంలేదు. భారత్‌లో పన్ను విధానాలు వారికి ప్రతికూలంగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ క్రిఎ్టో సంస్థ బైనాన్స్‌ సీఈవో చాంగ్‌పెంగ్‌ ఝావో క్రిఎ్టో లావాదేవీలపై భారత్‌ విధిస్తున్న పన్నులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రిఎ్టో కరెన్సీలకు ఇండియాలో అనువైన వాతావరణం లేదని తేల్చిచెప్పారు. ఒక్కో లావాదేవీపై ఒకశాతం పన్ను విధిస్తే, పెద్దగా లావాదేవీలు జరగవని, ఒక యూజర్‌ రోజుకి 50 లావాదేవీలు నిర్వహిస్తే అతను ఆర్జించిన దానిలో 70శాతం పన్నులకే చెల్లించాల్సి వస్తుంది. అలాంటప్పుడు పెద్దగా లావాదేవీలు జరగవు. ఇలాంటి వాతావరణంలో నిలదొక్కుకోవడం కష్టం అని ఝావో వ్యాఖ్యానించారు. క్రిఎ్టో ప్రమాదాన్ని గుర్తించిన భారత్‌, వాటి లావాదేవీలపై 30శాతం పన్ను విధించింది.

డిజిటల్‌ కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30 శాతం పన్ను ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అదనంగా ఒక శాతం టీడీఎస్‌ను కూడా విధించింది. 2022 ఏప్రిల్‌ నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా భారత మదుపర్లు క్రిఎ్టో పతనం నుంచి సురక్షితంగా బయటపడ గలిగారని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement