Thursday, April 25, 2024

Cricket: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మి.. సెల‌క్ష‌న్ క‌మిటీపై వేటు వేసిన బీసీసీఐ

మొన్న‌టికి మొన్న పూర్త‌యిన‌ టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓట‌మిపై బీసీసీఐ యాక్ష‌న్ షురూ చేసింది. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీ మొత్తం పైనా ఇవ్వాల (శుక్ర‌వారం) వేటు వేసింది. అంతేకాకుండా వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన కూడా రిలీజ్‌ చేసింది.

ఇక‌.. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావలే అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. దీనికోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. కనీసం 7 టెస్టు మ్యాచ్ లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ, లేక 10 వన్డేలు, 20ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారు దీనికి అర్హులు అని బీసీసీఐ తెలిపింది. కాగా, క్రికెట్ నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని పేర్కొంది. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని కూడా కొన్ని కండిష‌న్స్ పెట్టింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement