Tuesday, May 7, 2024

అద్భుతమైప ఆఫర్లను ప్రకటించిన ఐఐఎఫ్‌ఎల్‌ గోల్డ్‌ లోన్‌ మేళా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో ఒకటైన ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ 2022 జూన్‌ 15 నుంచి జులై 30 మధ్య వినియోగదారులందరికీ గోల్డ్‌ లోన్‌ మేళాలో గోల్డ్‌ లోన్‌ పై అద్భుతమైన ఆఫర్లను ప్రారంభించినట్లు ఐఐఎఫ్‌ఎల్‌ గోల్డ్‌ లోన్స్‌ జోనల్‌ హెడ్‌ శ్రీకాంత్‌.ఆర్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విలాసవంతమైన అంతర్జాతీయ పర్యటన బహుమతిలో ఉన్నాయన్నారు.

దీంతో పాటు 45రోజుల వ్యవధిలో భారతదేశంలోని 2400కు పైగా గోల్డ్‌లోన్‌ బ్రాంచ్‌ల నుంచి గోల్డ్‌లోన్‌ తీసుకునే ప్రతి కస్టమర్‌కు హామీ ఇవ్వబడిన బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రోహిత్‌ శర్మతో కూడిన ఆకర్షణీయమైన బహుమతులతో పాటు కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఫాస్ట్‌ ప్రాసెసింగ్‌, గరిష్ట రుణ విలువ, సులభమైన డిజిటల్‌ చెల్లింపు ఎంపికలతో అతి తక్కువ వడ్డీ రేట్లలో బంగారు రుణాలను కూడా అందిస్తోందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement