Sunday, May 5, 2024

డిజే టిల్లు సెకండ్​ పార్ట్​.. త్వరలోనే అధికారిక సమాచారం

కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లో మాంచి సక్సెస్​ సాధించిన వాటిలో డీజే టిల్లు మూవీ ఒకటని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని డైలాగ్స్.. తెలంగాణ యాస చాలా బాగా క్లిక్ అయ్యింనే చెప్పాలి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేయ‌డం ఆయన స్టైల్‌, యాస ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అయితే ఇప్పుడు ‘డిజే టిల్లు’ సినిమాకు సీక్వెల్ రానున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రయ‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు.. దీనికోసం సిద్దు తన టీమ్‌తో కలిసి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. డీజే టిల్లు సీక్వెల్ కూడా సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌ నిర్మించనుంది. ఇక‌ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెల్లడవుతుందని టాలీవుడ్​ వర్గాల ద్వారా తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement