Friday, April 26, 2024

ఉద్యోగ కోతలను సమర్ధించుకున్న అమెజాన్‌.. ఖర్చు తగ్గించుకోవడం కోసమేనన్న కంపెనీ

భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడాన్ని అమెజాన్‌ సీఈఓ అండీ జస్సీ సమర్ధించుకున్నారు. ఆర్థిక అస్థిరతల వల్ల ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా వెలుగులోకి వచ్చిన తొలిరోజుల్లో రిటైల్‌ వ్యాపారం వేగంగా వృద్ధి చెందిందని జస్సీ తెలిపారు. దీంతో మౌలిక వసతుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఖర్చు చేసేలా అప్పటి పరిస్థితులు ప్రోత్సహించాయన్నారు. అంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఈ విషయంలో తొందరపడుతున్నామనే విషయం అప్పుడే అర్ధమైందని, కాని తప్పలేదన్నారు.

ఎంత మంది ఉద్యోగులను తొలగించనుందనే విషయాన్ని అమెజాన్‌ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నారని వార్తలు వచ్చాయి. వీటిని అమెజాన్‌ ఖండిచలేదు. ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైందని మాత్రమే అమెజాన్‌ ధృవీకరించింది. 2023లోనూ ఉద్యోగాల కోత ఉంటుందని అమెజాన్‌ సీఈఓ స్పష్టం చేశారు. దీనిపై ఆయా విభాగాల అధిపతులు సమాచారం ఇస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement