Wednesday, May 15, 2024

మురగప్ప గ్రూప్‌ నుంచి ఈ ఆటో మంత్రా పేరుతో విడుదల చేసిన కంపెనీ

మురగప్ప గ్రూప్‌ ఈవీ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న టీఐ క్లీన్‌ మొబిలిటీ (టీఐసీఎం) మార్కెట్‌లో మంత్రా పేరుతో ఈ ఆటో రిక్షాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ నుంచి వచ్చిన మొదటి వాహనం ఇదే. దీన్ని సూపర్‌ ఆటోగా పేర్కొన్న కంపెనీ ఎలక్ట్రిక్‌ ఆటో ప్రారంభ ధర 3.02 లక్షలుగా పేర్కొంది. ఈ ఆటో ఇపీఎక్స్‌, ఇపీవీ, ఇపీవీ 2.0 పేరుతో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇపీఎక్స్‌, ఇపీవీ మోడల్‌ను ఒక సారి ఛార్జ్‌ చేస్తే 152 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ఇస్తుంది. ఇపీవీ 2.0 వెర్షన్‌ 197 కిలోమీటర్లు ఇస్తుంది. మంత్రా ఆటో టాప్‌ స్పీడ్‌ 55 కిలోమీటర్లు. 4 గంటల్లో బ్యాటరీలను ఫుల్‌ ఛార్జ్‌ చేయవచ్చు.

ఎలక్ట్రిక్‌ ఆటోల్లో మొదటిసారిగా మల్టి డ్రైవ్‌ మోడ్‌లో ఇవి లభిస్తాయి. పార్క్‌ అసిస్ట్‌ ఉంటుంది. మంత్రా ఎలక్ట్రిక్‌ ఆటో కాలుష్యాన్ని తగ్గించడంలో తన వంత పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌ అరుణ్‌ మురగప్ప చెప్పారు. అంబత్తూర్‌లో కంపెనీ ఉత్పత్తి ప్లాంట్‌ ఉంది. ఇందులో సంవత్సరానికి 50 వేల ఆటోలను ఉత్పత్తి చేసే సామర్ద్యం ఉంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో డీలర్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉందని, ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను వందకు పెంచుతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఐసీఎం మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేకే పావెల్‌ చెప్పారు. ఈ సంత్సరం నవంబర్‌, డిసెంబర్‌ నాటికి కంపెనీ కార్గో త్రీవీలర్‌ ఎలక్ట్రిక్‌ ఆటోలను కూడా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement