Monday, May 6, 2024

OLA | ఓలాపై 8 సంవత్సరాల వారంటీ.. కొత్త స్కూటర్‌ ఎస్‌1 ఎక్స్‌ లాంచ్‌

ప్రముఖ విద్యుత్‌ వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఓలా కొత్తగా ఎస్‌1ఎక్స్‌ పేరుతో 4కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో తీసుకు వచ్చింది. ఈ కొత్త స్కూటర్‌ ధర 1,09.999 రూపాయలుగా నిర్ణయించింది. ఒక సారి ఛార్జింగ్‌ చేస్తే 190 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రకించింది. ఈ స్కూటర్‌లో 6కిలోవాట్‌ మోటార్‌ను అమర్చారు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కొత్త ఓలా టాప్‌ స్పీడ్‌ 90 కిలోమీటర్లు. రెడ్‌ వెలాసిటీ, మిడ్‌నైట్‌, వోగ్‌, స్టీలర్‌, ఫంక్‌, పోర్స్‌లెమన్‌, వైట్‌, లిక్విడ్‌ సిల్వర్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. కొత్త ఓలా స్కూటర్‌ డెలివరీలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో 10.9 సెంటీమీటర్ల సెగ్మెంటెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఫిజికల్‌ కీ అన్‌లాక్‌ ఉంటుంది. స్మార్ట్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఉందులో ఉండవు.

8 సంవత్సరాల వారెంటీ…

ఈవీ బ్యాటరీ విషయంలో ఓలా కొత్త వారెంటీ సదుపాయాన్ని తీసుకు వచ్చింది. 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది. ఓలా విక్రయిస్తున్న అన్ని వాహనాలకు ఇది వర్తస్తుందని ఓలా ఛైర్మన్‌, ఎండీ భావిష్‌ అగర్వాల్‌ తెలిపారు. సర్వీస్‌ సెంటర్లను పెంచడంతో పాటు, పెద్ద ఎత్తున ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కావాలంటే కిలోమీటర్ల పరిమితిని 1.25 లక్షల కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందు కోసం 4,999 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్‌ నెట్‌వర్క్ పైనా ఓలా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 414 సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నాటికి వీటి సంఖ్యను 600కు పెంచనున్నట్లు తెలిపింది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ను కూడా వచ్చే త్రైమాసికం నాటికి 10వేల పాయింట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓలా తెలిపింది. ఓలా ఎస్‌1 ఎక్స్‌లో 4కిలోవాట్‌అవర్‌ ధర రూ. 1,09,000, 3కిలోవాట్‌ అవర్‌ ధర రూ. 89,999, 2కిలోవాటర్‌అవర్‌ ధర రూ.79,999 కంపెనీ నిర్ణయించింది. కొత్త స్కూటర్‌ లాంచ్‌తో ఓలా మొత్తం 6 విద్యుత్‌ స్కూటర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement