Wednesday, May 22, 2024

AP | బంగాళాఖాతంలో వాయుగుండం.. వేటకు వెళ్ళొద్దని మత్సకారులకు హెచ్చరిక

అమరావతి, ఆంధ్రప్రభ: ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్‌ నికోబార్‌ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమైందని బుధవారం నాటికి అది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్రస్థాయికి ఆ తర్వాత వాయువ్యంగా కదిలి ఈనెల 16న ఆంధ్రప్రదేశ్‌ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వ్యాపింది తీవ్ర వాయుగుండంగా మరే అవకాశము ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటు-ందని వాతావరణ శాఖ సూచించింది.


నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక మీద ఉన్న ఉపరితల అవర్తనము నుండి ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అండమాన్‌-నికోబార్‌ దీవుల మీద ఉన్న అల్పపీడనము వరకు ఉన్న ద్రోణిసగటు- సముద్ర మట్టానికి న 3.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అంబేద్కర్‌ కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తా తీరంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెెళ్ళొద్దని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నామని వితపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement