Thursday, May 2, 2024

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన‌.. విష్ణు కుమార్ రాజు

తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం రాజకీయ కుట్రగా అభివర్ణించారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు నిర్ణయించేది కేంద్ర నాయకత్వమని స్పష్టం చేసిన ఆయన.. నా అభిప్రాయం విస్పష్టంగానే చెప్పానని తెలిపారు. అలాగే 2 వేల నోట్ల ర‌ద్దుపై ఆయ‌న స్పందిస్తూ.. డబ్బులు ఆశ చూపించి ఓట్లు కొనుక్కుందామని చూసే పార్టీలకు నోట్ల రద్దుతో గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.

ఓటింగ్ శాతం పెరిగితేనే ప్రజాస్వామ్యం పర్యవేక్షణ సాధ్యమన్న ఆయన.. బ్లాక్ మనీ ఉన్న వాళ్లకు తప్ప.. రెండు వేల నోట్ల ఉపసంహరణ వల్ల సామాన్యులకు నష్టం లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటుకు రెండు వేల రూపాయలు పంచిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు విష్ణుకుమార్‌ రాజు.. పెద్దనోట్ల వల్ల ఎదురయ్యే సమస్యలు గుర్తించే తాను ఆర్బీఐకి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు.. ఇక, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా నోట్లు చెలామణీకి ప్రయత్నాలు జరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement