Thursday, May 2, 2024

నేను స్టూడెంట్ సార్.. సాయంత్రం ట్రైల‌ర్ రిలీజ్

హీరో బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్డూడెంట్‌ సార్‌ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమా జూన్‌ 2న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై మంచి హైపే క్రియేట్‌ చేశాయి. కాగా మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. సస్పెన్స్‌ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాంది ఫేమ్ సతీష్‌ వర్మ నిర్మించాడు. గణేష్‌కు జోడీగా అవంతిక హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ బాణీలు సమకూర్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement