Wednesday, May 8, 2024

AP | వెంక‌టేశ్ ఫ్యామిలీలో విషాదం.. బాబాయి మోహన్​ ​బాబు కన్నుమూత

సినీ న‌టుడు ద‌గ్గుబాటు వెంకటేశ్ బాబాయి మోహన్ బాబు కన్నుమూశారు. దగ్గుబాటి మోహన్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడికి సొంత‌ తమ్ముడు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఆయ‌న తుదిశ్వాస విడిచారు.

కాగా, దగ్గుబాటి మోహన్ బాబు అంత్యక్రియలు కారంచేడులో రేపు (బుధ‌వారం) సాయంత్రం జరగనున్నాయి. త‌న బాబాయి మృతి నేపథ్యంలో నిర్మాత సురేశ్ బాబు, ఆయన తనయుడు అభిరామ్ కారంచేడు వెళ్లి నివాళులు అర్పించారు. షూటింగ్ లో ఉన్న వెంకటేశ్ రేపు ఉదయం కారంచేడు చేరుకుంటారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement