Sunday, May 19, 2024

AP: దుంగలతో ఇద్దరు ఎర్ర దొంగలు…గొడ్డళ్ళు రంపాలతో మరో 18మంది అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : రాయలసీమ పరిధిలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లో 10ఎర్రచందనం దుంగలను, కారు స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను , గొడ్డళ్లు, రంపాలతో అడవుల్లోకి చొరబడుతున్న తమిళనాడుకు చెందిన మరో 18మందిని అరెస్టు చేసినట్టు ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ అధికారులు ఈరోజు ప్రకటించారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీ చెంచుబాబుకు చెందిన అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్ఐ చిరంజీవి, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీమ్ స్మగ్లింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుని వెళ్లారు.

సుండుపల్లి మండలం సానిపాయ రేంజ్ లో కుడుమాండ్లపల్లి రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉన్నకారును చుట్టుముట్టారు. టాస్క్ ఫోర్సు సిబ్బందిని గమనించిన కొందరు పారిపోగా, బెంగుళూరుకు చెందిన సయ్యద్ నౌషద్ (28) పట్టుబడ్డాడు. కారులో ఐదు ఎర్రచందనం దుంగలు కనిపించాయి. అతడిని అరెస్టు చేసి, 5ఎర్రచందనం దుంగలు, హ్యుండయ్ కారును స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ కుమార్ టీమ్ తిరుపతి హెడ్ క్వార్డర్స్ నుంచి బయలుదేరి రోళ్లమడుగు, ఏకాసు కుప్పం వైపు కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రేంజి ఎస్ఆర్ పాళెం సెక్షన్ లోని పుట్టంగి మడుగు వద్ద కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్లూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టేయత్నం చేయగా, దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే తమిళనాడు తిరువన్నామలై జిల్లాకు చెందిన ఏలుమలై కుప్పుస్వామి (28)ని పట్టుకోగలిగారు. ఆప్రాంతంలో ఐదు ఎర్రచందనం దుంగలు లభించాయి.

మరో సంఘటనలో రైల్వే కోడూరు టాస్క్ ఫోర్సు సబ్ కంట్రోల్ కార్యాలయం నుంచి ఆర్ఐ కృపానంద ఆర్ఎస్ఐలు రాఘవేంద్ర, విశ్వనాథ్ నెల్లూరు జిల్లా కలువాయి మండపం వద్దకు చేరుకుని రాబోలు బావి వద్ద ఫారెస్టు బీటు సిబ్బందితో కలసి కూంబింగ్ చేపట్టారు. రాజుపాలెంబీటు పరిధిలోని వెంకటరామరాజుపేట నుంచి పడమర వైపుకు చేరుకోగా కొంత మంది వ్యక్తులు టెంపోట్రావెలర్ దిగులూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని చుట్టుముట్టగా అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వారి వద్ద 7ఇనుప గొడ్డళ్లు, మడతపెట్టిన రంపాలను కొనుగోన్నారు. వీరు అడవిలో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 18మందిని అరెస్టు చేసి, టెంపో ట్రావలర్ ను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అరెస్టుయిన వారిలో తమిళనాడుకు చెందిన శేఖర్ వెలకాసి(41), దచ్చన వెలకాసి (33), ప్రకాష్ చిన్నపయ్యన్ (43), అశోక్ (33), పొన్నుస్వామి చిన్నపయ్యన్ (43), సంపత్ దచ్చినామూర్తి (19), సుందరేశన్ సూర్యన్ (24), రాజవేల్ సూర్యన్(29), రాజేంద్రన్ చిన్నసామి(39), చిన్నసామిరాజి(64), చంద్రన్ సడయన్ (49), విజయ్ కుమార్ (43), మురుగన్ పొన్నుసామి (44), విజయకుమార్ ముత్తు (33), రామర్ చిన్నపయ్యన్(39), సౌందర్ మణి (21), కుప్పుసామి అప్పసామి (39), నెల్లూరు టౌన్ కు చెందిన నక్కన మహేష్ రెడ్డి ఉన్నారు ఈ కేసులను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనులో నమోదు చేసి, ఎస్ఐ సీహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వారి కోసం స్పెషల్ టీమ్ లు కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి ఎస్ఫీ పి. శ్రీనివాస్ అభినందించి రివార్డులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement