Wednesday, May 8, 2024

అమెరికా వెళ్లేందుకు సుజనా చౌదరికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అమెరికా వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికా వెళ్లేందుకు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వెళ్లే ముందు, వచ్చిన తర్వాత సీబీఐకి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల తయారీలో సాంకేతికతపై చర్చించేందుకు అమెరికా వెళ్లనున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులు ఉన్నందున సుజనా అనుమతి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement