Sunday, April 28, 2024

లవ్ స్టొరీ రిలీజ్ పై రూమర్స్ నమ్మకండి !!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

కాగా తాజాగా ఈ సినిమాను ఆగస్టు 7వ తేదీన ఈ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు రాగా దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. అధికారికంగా క్లారిటీ ఇచ్చే వరకూ ఎలాంటి వార్తలు నమ్మవద్దని… థియేటర్ల విషయమై స్పష్టత వచ్చే దాకా లవ్ స్టోరీ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement