Sunday, April 28, 2024

ప్రోత్సాహకాల పేరుతో మరో దగా: జగన్ పై అచ్చెన్న సెటైర్

వైసీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ప్రోత్సాహకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహకాల పేరుతో మరోమారు సీఎం జగన్‌ దగా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇచ్చిన పారిశ్రామిక రాయితీల కన్నా విద్యుత్ చార్జీల రూపంలో పీకుడే ఎక్కువ ఎద్దేవా చేశారు. ఎంఎస్ఎంఈలకు 1600 కోట్ల బకాయిలు ఉంటే ఇచ్చింది 440 కోట్లేనని తెలిపారు. టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్లులకు 2 వేల కోట్ల బకాయిలుంటే ఇచ్చింది 684 కోట్లేనని వివరించారు. రకరకాల కొర్రీలతో లబ్ధదారుల సంఖ్యను నాలుగోవంతు కోతకోశారని మండిపడ్డారు. ప్రభుత్వం నిధులు వైసీపీ నేతలు లూటీ చేయడం వల్లే అరకొరగా రాయితీలు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

కాగా, ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు: సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement