Wednesday, May 22, 2024

కొడాలి నాని ఓ బూతు మహారాజు: సోము

ఏపీ మంత్రి కొడాలి నానిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని ఓ బూతు మహారాజు అని అభివర్ణించారు. బూతులు తిట్టేవారికి ప్రత్యేకంగా అవార్డులు ఇస్తే కొడాలి నానికే ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కేంద్రం సూచన మేరకు అన్ని రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం తగ్గించనంటుందని మండిపడ్డారు. ఇది ఎక్కడి వితండవాదం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించాలని కోరితే.. మంత్రులు ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధరలు తగ్గించి ఉపశమనం కలిగించినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించదని నిలదీశారు.’పెట్రోల్‌ ధరలు తగ్గించబోమని ప్రజలను కొడతారా? ఎయిడెడ్‌ విద్యా సంస్థల పిల్లలను కొట్టినట్లు కొడతారా? ప్రజలకు ఉపశమనం చేయాలని కోరితే రాద్ధాంతం చేస్తారా?’ అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువున్నాయని తెలిపారు. దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తుంటే, మమ్మల్ని పెట్రోల్ పోసి తగులబెడతామంటారా? అని మండిపడ్డారు. సీపీఎస్ విధానాన్ని వారంలో రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చని మిమ్మల్ని తగులబెట్టారా? అని ప్రశ్నించారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement