Saturday, April 27, 2024

Skill Case – చంద్ర‌బాబును రెండు రోజుల సిఐడి క‌స్ట‌డీకి ఎసిబి కోర్టు అనుమ‌తి..

అమ‌రావ‌తి – స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించింది. ఈ సందర్భంగా సీఐడీకి ఏసీబీ కోర్టు జర్జి పలు కండిషన్లను విధించారు. కాగా,మరోవైపు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.

ఏసీబీ కోర్టు జడ్జి కండిషన్స్:
విచారణ ఫొటొలు, వీడియోలు బయటకు రాకూడదు
కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలి
విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలి
చంద్రబాబును ఆయన లాయర్ల సమక్షంలోనే విచారించాలి
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం
కస్టడీ మగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement