Sunday, May 12, 2024

పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే.. చదువుతో పేదరికం దూరం : సీఎం జ‌గ‌న్

కర్నూలు బ్యూరో : పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలనీ, నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందనీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్‌ మీడియం చదువుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం తన చేతులమీకును విద్యార్థులకు క్రిస్టియన్స్ పంపిణీ చేశారు. సందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్నట్లూ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వేసవి సెలవుల అనంతరం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఈ కానుక అందజేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.

విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విషయంను ముఖ్యమంత్రి గుర్తు చేశారు.దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నామనీ, నాడు-నేడు కింద​ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నట్లు చెప్పారు. 2020-21లో విద్యాకానుకకు రూ.648 కోట్లు ఖర్చు చేశామని. 42.34 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. 2021-22లో విద్యాకానుకకు రూ.789 కోట్లు ఖర్చు చేశామని, వీటివల్ల 45.71లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు.ఇక. మూడో ఏడాదిలో విద్యాకానుకకు రూ.931 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 47.40 లక్షల మంది లబ్ధి చేకూరుస్తున్నట్టు చెప్పారు. స్థానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అడిగిన మేరకు ఆదోనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్‌, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికపై ప్రకటించారు. కార్యక్రమం అనంతరం అన్ని పాఠశాలలకు సంబంధించిన 2022-23 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement