Sunday, April 28, 2024

AP | భగ్గుమంటున్న కూరగాయలు ధరలు.. 180 దాటేసిన టమాటా రేటు

(ప్రభన్యూస్) : అన్ని వర్గాల ప్రజలకు కూరగాయలు ధరలు సగటు జనానికి శరాఘాతంగా మారాయనీ అల్లూరిసీతారారాజుజిల్లా వి అర్ పురం మండల ప్రజలువాపోతున్నారు.. తమ మొప్పు కోసం బటన్ నొక్కి ఉచితంగా డబ్భులు వేస్తున్న ప్రభుత్వం వాటిని పూడ్చడానికి మా మీద మోయలేని భారాలు మోపుతుంటే సామాన్య జనం పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారిందని మండల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనాడు అయిన టమాటా ఇంత రేటు ఉందా రోజెంతా కష్ట పడితే వచ్చే కూలీ డబ్బులు200 లేక 300 ఈ మూడు వందల లో 180 టమాటా కొనగలమా ఇదేమీ దౌర్భాగ్య దుస్థితి అంటూ ప్రజలు భాహిరంగం గానే అసహనం వెలి బుచ్చుతున్నారు.

గతంలో 2 వందల రూపాయలు పట్టుకెలితే సరిపడా సరుకులు వచ్చేవి ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళితే సంచి నిండని వైనం వంట నూనె ఉల్లి అన్ని రకాల కూరగాయలు ధరలు మార్కెట్లో కొనాలంటే పెరిగిన ధరలు తో కొనలేక కారం మెతుకులు తింటున్నదుస్థితి వుందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఏడాది కాలంగా ఇదే ధరలు ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతున్నారు. తప్ప జనంపడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు అని మండి పడుతున్నారు. ప్రజలు.

ఒక పక్క వరద విపత్తులు అతలాకుతలం చేస్తుంటే మూలిగే నక్క పై తాటి కాయ పడ్డ చందాన వడ్డన మీద వడ్డన చేస్తూ రోజూ రోజుకు ఆకాశాన్ని తాకేలా నిత్యావసరాల ధరలు నింగికి తాకి సగటు కుటుంబాల దైనందిన జీవితాలు చిధ్రం గా దర్శన మిస్తున్నాయనీ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూరగాయలు కొందామంటే కొరివి తిందామంటే అడవి అన్నట్లు ఉంది ఈ ప్రభుత్వంలో అంటూ నిట్టుర్చుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం ఉచిత పదకాల పై ఉన్న శ్రద్ధ సగటు మానవుని నిత్య కృత్యం అయిన కూరగాయలు ధరలు వెంటనే నియంత్రణ చేపట్టి అన్ని రకాల ధరలు తగ్గించాలని ముక్త కంఠంతో ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement