Saturday, April 27, 2024

పాఠశాలకు నీటిక్యాన్లు..

కొనకనమిట్ల ‌: మండలంలోని పెదారికట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు తాగునీటి అవసరాల కోసం ఉచితంగా 10 క్యాన్లను దాత, మాజీ ఎస్‌ఎమ్‌సి చైర్మన్‌ గుజ్జుల చెన్నారెడ్డి అందజేశారు. ఈ సంధరర్భంగా పాఠశాల హెచ్‌యం పరిగె నరసింహారావు హిందీ ఉపాధ్యాయురాలు వనితలు దాత దాతృత్వం, సేవాభావం గురించి కొనియాడారు. గతంలో కూడా విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు అందజేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ సభ్యులు ఓబులు, ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement