Thursday, March 28, 2024

వీధి దీపాల నిర్వహణ బాధ్యత కార్యదర్శులదే..

ఉలవపాడు : గ్రామాలలో వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఆయా గ్రామ పంచాయితీల కార్యదర్శులపై ఉంటుందని ఎంపిడిఓ రవికుమార్‌ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎల్‌ఇడి ప్రాజెక్టు నిర్వహణపై ఏపిఎస్‌ఇఇడి సంస్థ ప్రతినిధి సిఓ చల్లగండ్ల హరీష్‌ శిక్షణ ఇచ్చారు. వీధి దీపాల నిర్వహణ, మరమ్మత్తులు స్థానిక లైన్‌మెన్‌ సహకారం తీసుకొని పరిష్కరించాలని సచివాలయ పరిధిలో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు మరియు గ్రామ వాలంటీర్లు ఎప్పటికప్పుడు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సహకారం అందించాలని కోరియున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఈఓఆర్డీ ఎల్‌.చెంచమ్మ, ఎలక్ట్రికల్‌ ఏఇ టి.వి.నరశింహం, ఉలవపాడు, శింగరాయకొండ మండలాలకు సంబంధించిన పంచాయితీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ సహాయకులు, ఎనర్జీ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement