Sunday, April 28, 2024

నితిన్ దశ తిరిగినట్టేనా..!! రంగ్ దే రివ్యూ

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగ్ దే. ఇటీవల వచ్చిన చెక్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నితిన్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే నితిన్ అర్జున్ గా కనిపించనున్నాడు. అలాగే కీర్తి సురేష్ అనుపమ గా కనిపించనుంది. ఇద్దరూ చిన్నప్పటినుంచి పక్కపక్క ఇంట్లో ఉంటారు. ఇక నితిన్ కీర్తి కన్నా చదువులో వెనుకబడి ఉంటాడు. దీంతో నితిన్ తండ్రి నరేష్ ఎప్పుడు తిడుతూ ఉంటాడు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

ఆ తర్వాత చదువు కోసం దుబాయ్ కి ఇద్దరూ వెళ్తారు. అయితే అక్కడ నుంచి ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం రెగ్యులర్ కామెడీతో నడుస్తోంది.సుహాస్, బ్రహ్మాజీ తో ఉండే సీన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే నితిన్ కీర్తి సురేష్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. సినిమా మొత్తానికి వీరి పెళ్లి ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ అడివి శాస్త్రి కామెడీ ఆకట్టుకుంటుంది.

పెళ్లి జరిగిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు ట్విస్టులు చుసిన ప్రేక్షకులకు అవసరమా అనిపిస్తాయి. మరోవైపు వీరి మధ్య ఎమోషనల్ టచ్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వనట్లు కనిపిస్తుంది. ఇక నటన పరంగా నితిన్ కీర్తి సురేష్ మెప్పించారు. అలాగే మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మిగిలిన నటీనటులు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఓసారి థియేటర్ కి వెళ్లి రంగ్ దే సినిమా చూసి రావచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement