Monday, April 29, 2024

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

ఉలవపాడు , ఉలవపాడు మండల కేంద్రంలో డాక్టర్‌ బి.ఎం.వి. కృష్ణ చైతన్య ప్రముఖ గుండె వైద్య నిపుణులు ఒంగోలు వారు ఉలవపాడు గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపము నందు పేదలకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత గుండె వైద్య శిబిరంలో బిపి, షుగరు, ఈసిజి పరీక్షలు ఉచితంగా చేశారు. అనంతరం రోగులకు తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ఉచితంగా మందులు పంపిణీచేశారు. ఈ ఉచిత వైద్య శిబిరము ఉలవపాడుకు చెందిన ఆర్‌ఎంపి కరీం ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement