Saturday, April 27, 2024

ఈవీఎం, వీవీప్యాడ్లపై అవగాహన కల్గి ఉండాలి – జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

నాయుడుపేట : ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరు విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా సూళ్లూరుపేట సెగ్మెంట్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సెంటర్స్ ను పరిశీలించి పనిచేస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి ఇస్తున్న శిక్షణా తరగతులను పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనులు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో బాగంగా ఇస్తున్న ట్రైనింగ్ ను పోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఎలాంటి పొరపాట్లు కు తావులేకుండా ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈవీఎం, వివిప్యాడ్స్ నిర్వహణ పై మరియు మాక్ పోలింగ్ నిర్వహణ పై ఎలాంటి సందేహాలు లేకుండా ట్రైనింగ్ సమయంలో శ్రద్ధగా విని ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. ఈవీఎం, వివిప్యాడ్స్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకుని ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు సజావుగా జరిగేలా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయ ఆవరణంలో జరుగుతున్న ఈవీఎం మరియు వివి ప్యాడ్స్ కమీషనింగ్ ప్రక్రియను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఆర్డిఓ సరోజిని, రెవెన్యూ, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement