Sunday, April 28, 2024

TDP – జగన్ పొట్ట నిండా అబద్ధాలే… చంద్రబాబు

జగన్​ అంటేనే అబద్ధం
పొట్ట నిండా అబద్ధాలే..
నోరు తెరిస్తే అబద్ధాలే
బటన్ నొక్కింది ఎంత?
జగన్ బొక్కింది ఎంత?
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తాం
రైతు కూలీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
ప్రతి కుటుంబానికి ₹20వేలు ఇస్తాం
గూడూరులో మహిళలతో చంద్రబాబు ముఖాముఖీ
మహిళల సమక్షంలోనే పుట్టినరోజు వేడుకలు

(ఆంధ్రప్రభ స్మార్ట్, గూడూరు ప్రతినిధి) – జగన్ పొట్టనిండా అబద్దాలే… నోటి నిండా అబద్దాలే అనిటీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. తిరుపతి జిల్లా సీఆర్ రెడ్డి కళ్యాణమండపంలో శనివారం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక మంది మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. నర్సింగ్ కళాశాలలు పెంచాలని, కోవిడ్ కాలంలో నర్సింగ్ శిక్షణ ఇచ్చారని, కానీ తమకు ఎలాంటి ప్రతిఫలం చేకూరలేదని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం మద్యంతో తన భర్త చనిపోయాడనిఓ మహిళ ఆరోపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జనానికి ఇచ్చిన దానికంటే జగన్ దోచేది ఎక్కువ అని ఆరోపించారు.

- Advertisement -

ఖనిజ సంపద మొత్తం దోచేశారు..

బటన్ నొక్కి బొక్కింది ఎంత? దొబ్బేసింది ఎంత? జగన్ ఓ అసమర్ధుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. కొండలని మాయం చేశారని… ఖనిజ సంపదనీ దోచేశారని ఆరోపించారు.పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని చేయాలనేదే తన జీవిత లక్ష్యమని, పేదరికంలేని సమాజాన్ని చూడాలన్నదే తన ఆశయమని చంద్రబాబు వివరించారు. జగన్ రెడ్డి కాదు… అతడు గన్ రెడ్డి అని, మద్యం, మద్యం షాపులూ ఆయనవేనని . భూముల మీద హక్కులూ ఆయనవేనని తీవ్రంగా ఆరోపించారు. మహిళలలో బ్రహ్మాండమైన చైతన్యం ఉందని, ఆడబిడ్డలను చదివించాలని ఎన్టీఆర్ భావించారని, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు వివరించారు. ఆస్తిలో సమానహక్కు కల్పించారని, మగవారితో సమానంగా మహిళలూ రాజకీయాల్లో రాణించాలని. చట్టసభల్లో కూడా మహిళలు ఉండాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

చట్టసభల్లో మహిళలు 33 శాతం రిజర్వేషన్లు

మహిళలు తమ కుటుంబాలకి ఆర్ధిక మంత్రిలా ఉండేలా చేశానని… డ్వాక్రా గ్రూపులు పెట్టించి ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లామని, మహిళలకు 33 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు. ఇవాళ ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి తెచ్చామని.. మగబిడ్డల కంటే ఆడబిడ్డలే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్నారు. దీపం పథకం పెట్టి అందరికీ వంట గ్యాసు ఇచ్చామని తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని మరుగుదొడ్లు కట్టించామని గుర్తుచేశారు. సమాజంలో మగ, ఆడ అనే తేడా లేదని.. మగవాళ్లకి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తే… ఆడబిడ్డలకి రైట్ బ్రెయిన్ పనిచేస్తుందని చెప్పారు.ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ పుట్టిల్లు అని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని.. ఎన్డీఏ మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వబోతుందని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలని ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ

అధికారంలోకి వచ్చాక అందరికీ ఇళ్లు ఇస్తామని.. రెండు సెంట్లు లెక్కన స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ‘‘నేను సీఎం అయిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలు మీదే మొదటి సంతకం‌ చేస్తా’’ అని చెప్పారు. రైతుకూలీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని.. ఏడాదికి ప్రతి రైతు కూలి కుటుంబానికి రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దిశ చట్టం ఉందా? కనీసం నిర్భయ చట్టం ద్వారా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ అందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్ వన్‌గా ఉండాలనేది నా లక్ష్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement