Monday, May 20, 2024

Nagar Kurnool – ప్ర‌వీణ్ కుమార్‌ను గెలిపించండి – ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ పిలుపు

హైదరాబాద్ – సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. నల్లమల ప్రాంతంలో పుట్టిన ఆయన తన ఆరేండ్ల పదవీకాలాన్ని వదులుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బహుజనవాదాన్ని భుజాన ఎత్తుకొని ప్రజాసేవలోకి అడుగుపెట్టారని అన్నారు. ఈ మేర‌కు కేటీఆర్‌ ట్విట్ చేశారు.. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌వీణ్ గెలిపించాల‌ని కోర‌తూ ఐపీఎస్‌గా పదవీలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

- Advertisement -

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ఆద్యుడు ..

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కి ఆయనే ఆద్యుడని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఐక్యరాజ్యసమితి కోసం ఒకప్పటి యుగోస్లావియాలో కూడా పని చేశారని గుర్తుచేశారు. తన సేవలకు గాను రాష్ట్రపతి పురస్కారం, యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్, పోలీస్ గ్యాలంట్రి మెడల్ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ నాయకత్వంలో జరిగిన గురుకుల విద్యావిప్లవంలో ప్రవీణ్ కుమార్ నిర్వహించిన పాత్ర అమోఘమైనదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement