Sunday, April 28, 2024

YSRCP – జగన్ మేమంతా సిద్ధం యాత్ర 19 రోజు – ఉల్లాసం… ఉత్సాహం


(ఆంధ్రప్రభ స్మార్ట్, అనకాపల్లి ప్రతినిధి) – ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఈ యాత్ర 19వ రోజుకు చేరుకోగా.. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు. బస్సు యాత్ర వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. జననేత కోసం జనం మండే సూరీడును సైతం లెక్క చేయడం లేదు. 19వ రోజు శనివారం ఉదయం అనకాపల్లి జిల్లా గొడిచర్లనుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్లలో రాత్రి బస ప్రాంతంలో జగన్‌ను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరున్నా పలకరిస్తూ..యోగక్షేమాలను తెలుసుకున్నారు.

- Advertisement -

పార్టీ నేత‌ల‌కు దిశానిర్ధేశం..

పార్టీ నేతలకు జ‌గ‌న్ దిశానిర్ధేశం చేశారు. జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన గొడిచర్ల ప్రాంతంలో యాత్ర పాఠంభమైంది. సక్కపల్లి, పులపల్లి, యలమంచిలి బైపాస్ మీదుగా చేరుకుని భోజన విరామం ఉంటుంది. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 1.30 గంటలకు చింతసారం వద్ద బహిరంగ సభ ఉంటుంది. బయ్యవరం, కళంకోట చిన్నయపాలెం వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంటారు. అనకాపల్లి జిల్లా గొడిచర్లలో అమలాపురం జనసేన నాయకులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అమలాపురం సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, డీఎం ఆర్ శేఖర్, జనసేన వీరమహిళ దుర్గాభవానీకి పార్డీ కండువ కప్పి సీఎం జగన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement