Saturday, April 20, 2024

చల్లబడిన హైదరాబాద్..

గత కొన్నిరోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ హైదరాబాద్ వాసులు ఇవాళ వర్షం పడడంతో కాస్త ఊరట పొందారు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా, పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఎస్సార్ నగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఈసీఐఎల్, ఓల్డ్ బోయిన్ పల్లి, మల్లాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, ఫిలింనగర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement