Saturday, April 27, 2024

టిడిపి అభ్యర్థికి మ‌ద్ద‌తుగా వైసిపి కార్య‌క‌ర్త‌లు న‌గ‌దు పంపిణి – అరెస్ట్

నెల్లూరు – కోట – 1 వ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థికి అనుకూలంగా బుధవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనుచరులు కోట గ్రామానికి చెందిన 5 వ వార్డు మెంబర్ మహా కూటమి అభ్యర్థి ముస్లిం వీధిలో ఓటరు స్లిప్ లతో పాటు డబ్బులు పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సమాచారం అందడంతో వారు డబ్బులు పంచుతున్న వారిని రెడ్ హ్యాండ్ గా పట్టుకొని కోట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుచరుల వద్ద నుండి ఓటర్ స్లిపులు 28,200 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో పాటు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని కోట పోలీసు స్టేషన్ కు తరలించారు, డబ్బులు పంపిణీ పై ఎలక్షన్ ఇంచార్జ్ ఎస్సై మనోజ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే కోట గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపరెడ్డి వినోద్ రెడ్డి నేతృత్వంలో ఎంపిటిసి అభ్యర్థులను నిలబెట్టగా తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపిటిసి అభ్యర్థులు బరీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఓడించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనుచరులు టీడీపీ అభ్యర్థులు తరుపున డబ్బులు పంచడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కూడా మహ కూటమి పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు వైసీపీ నేతలు టీడీపీ తో కుమ్మక్కు అయినా సంఘటన లు మరువక ముందే టీడీపీ ఎంపిటిసి అభ్యర్థికి మద్దతు గా అనుచరులు డబ్బులు పంచడం పై వైసీపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళుతునట్లు వైసీపీ నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement