Friday, April 19, 2024

వకీల్ సాబ్ వస్తున్నాడు: అలియాభట్

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన‌ వ‌కీల్‌సాబ్ ఏప్రిల్ 9 న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. వ‌కీల్‌సాబ్ తో పాటు బాలీవుడ్ భామ అలియాభ‌ట్ లీడ్ రోల్ లో న‌టిస్తోన్న గంగూభాయ్ క‌థియావాడి ట్రైల‌ర్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. ఈ నేప‌థ్యంలో అలియాభ‌ట్ ఓ వైపు వ‌కీల్‌సాబ్ సినిమాను చూడండి అంటూనే త‌న సినిమాను కూడా ప్ర‌మోట్ చేసుకుంటోంది. అంద‌రికీ న‌మ‌స్కారం..అంద‌రూ ఎదురుచూస్తున్న సినిమా వ‌కీల్‌సాబ్. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ అండ్ టీంకు ఆల్ ది వెరీ బెస్ట్‌. అభిమానులు రెడీగా ఉండండి..వకీల్‌సాబ్ వ‌చ్చేస్తున్నాడ‌ని చెప్తోంది. అలియాభ‌ట్ ముద్దు ముద్దగా తెలుగులో మాట్లాడుతూ.. వకీల్‌సాబ్‌ను ప్ర‌మోట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement