Friday, June 18, 2021

కోవిడ్ పై 104 ద్వారా పూర్తి సమాచారం: ధర్మాన

కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. కోవిడ్ వచ్చిందని ప్రజలు ఎవరు భయపడొద్దని సూచించారు. ప్రయివేట్ ఆసుపత్రులను కూడా ప్రభుత్వం అధీనంలో తీసుకుందని, బ్లాక్ మార్కెట్లో అనవసర మందుల కోసం ప్రజలు పరుగులు తియొద్దన్నారు. 104 ద్వారా అన్ని సదుపాయాలు, పూర్తి సమాచారం ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు పాటించాలని కోరారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో 80 వరకు వెంటిలేటర్ లు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 2780 వరకు కోవిడ్ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాక్సినేషన్ ద్వారా కోవిడ్ పూర్తిగా నిర్మూలన జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News