Thursday, May 9, 2024

బాలకృష్ణపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్

ప్రభ న్యూస్ విజయవాడ – టిడిపి ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ టిడిపి అధినేత చంద్రబాబు తప్పులు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్ర‌శ్నించారు. విజయవాడ మధుర నగర్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ… ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు పాత్ర ఏంటో బాలకృష్ణ కు తెలుసా అని అడిగారు.

ఎన్టీఆర్ ను అధికారంలో నుండి క్రిందకు దింపే పాత్ర లో చంద్రబాబు, బాలకృష్ణ కీలకంగా ఉన్నారన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన మీ బావ గురించి బాలకృష్ణ ఇప్పటికైనా నిజాలు తెలపాలన్నారు. బాలకృష్ణకు మైండ్ బ్లాక్ అయి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని, బాలకృష్ణకు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement