Monday, May 6, 2024

ఉద్యోగ సంఘాల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాలి

క‌ర్నూల్ : ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మలిదశ ఉద్యమంలో భాగంగా మొదటిగా శనివారం కర్నూలు, పాత బస్టాండ్ దగ్గర కొండారెడ్డి బురుజు వద్ద వివిధ సంఘాల నాయకులతో ఉద్యోగులందరూ నల్ల కండువా కప్పుకుని వివిధ నినాదాలతో ఉన్న ప్లకార్డుల ప్రదర్శన చేశారు. డిమాండ్ల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరి కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.వై.కృష్ణ, రాష్ట్ర కమిటీ కోశాధికారి మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యాచరణ అంతా తూచా తప్పకుండా ఉద్యోగస్తులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మలి విడత కార్యాచరణ లోపల ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు సిద్ధమయ్యారు.

డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వర రావు మాట్లాడుతూ.. తొలి విడత ఉద్యమాన్ని సక్సెస్ చేసుకున్నామని తదుపరి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయుట ద్వారా మన డిమాండ్లు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల తరఫున శంకరప్ప, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ తరఫున రవీంద్ర రెడ్డి, వీఆర్వో అసోసియేషన్ నాయకులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సంఘం కోపరేటివ్ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రమణయ్య, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అనేక డిపార్ట్మెంట్ సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొని ప్లకార్డు ప్రదర్శన చేశారు. తదనంతరం జరిగిన మీడియా సమావేశంలో నాయకులు ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement