Sunday, May 19, 2024

AP : నేడు మోదీ రాక – రాజమండ్రి లో ట్రాఫిక్ ఆంక్షలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ‌ ప్రధాని మోడీ ప‌ర్య‌టించ‌నున్నారు. మధ్యాహ్నం రాజమండ్రి వేమగిరి సెంటర్లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈమేర‌కు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

- Advertisement -

రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధించారు.. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.

విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు….

  • గుండుగొలను వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • తాడేపల్లిగూడెం వైపుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాలి..
  • జొన్నాడ వైపుగా వచ్చే వాహనాలు మండపేట- రామచంద్రపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాలి..

విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు….

  • కత్తిపూడి వైపుగా వచ్చే వాహనాలు పిఠాపురం- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాలని సూచించారు.
  • జగ్గంపేట మీదగా వెళ్లే వాహనాలు సామర్లకోట- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది.
  • జిల్లా పరిసర ప్రాంతాలలో వేమగిరి మీదుగా వచ్చి వెళ్లే వాహనాలకు.
  • జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- దేవరపల్లి మీదుగా విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- కొవ్వూరు- విజ్జేశ్వరం- పెరవలి- రావులపాలెం మీదగా వెళ్లవలెను.
  • రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదగా వెళ్లాలి.
  • రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదగా వెళ్లాలి.
  • వేమగిరి- ధవలేశ్వరం- ఐ.ఎల్.టి.డి జంక్షన్- కోటిపల్లి బస్టాండ్ మీదుగా వెళ్లవలెను.
  • వేమగిరి- కేశవరం- ద్వారపూడి- మండపేట- రామచంద్రపురం మీదుగా కాకినాడ వెళ్లవలెను..
  • పెరవలి జంక్షన్ -సమిశ్ర గూడెం-విజ్జేశ్వరం- కొవ్వూరు- గామన్ బ్రిడ్జి మీద వెళ్లవలెను.

ఇక, పై ట్రాఫిక్ డైవెర్సన్స్ ని రాజమండ్రి పట్టణ, పరిసర ప్రాంత గ్రామ ప్రజలు గమనించి, పోలీసు వారికి సహకరించవలిసినదిగా తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్ పోలీసు శాఖ విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement