Saturday, May 4, 2024

పేదల కోసం వర్షంలో.. న‌య‌న‌తార‌ దంప‌తులు

వ‌ర్షంలో షెల్ట‌ర్ కింద ఉన్న పేద‌ల‌కు వ‌స్తు సామాగ్రి అందించారు స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార దంప‌తులు. ఓ వైపు వర్షం కురుస్తుండగా.. భర్త విఘ్నేశ్ శివ‌న్ తో కలసి ఆమె వీధుల్లోని వారికి వస్తు సామగ్రిని అందించింది. వర్షం పడుతున్న సమయంలో బస్ షెల్టర్ వద్ద సేదతీరుతున్న వారికి సామాగ్రి అందిస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్ లోకి చేరింది. భర్త విఘ్నేష్ శివన్ ఒక చేత్తో గొడుగు పట్టుకోగా, మరో చేత్తో కవర్ లను పట్టుకున్నాడు. నయనతార ఒక్కోటీ తీసుకుని అక్కడున్న పేదలకు అందిస్తోంది. నయనతార టీ షర్టు, జీన్స్ ధరించి ఉంది. ఈ వీడియోని చూసిన అభిమానులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా లేడీ సూపర్ స్టార్ అని ఒకరు అంటే.. వర్షంలో గూడు లేని పేదలకు సాయం చేస్తోందని కొందరు ప్రశంసిస్తున్నారు. గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి అని మరో యూజర్ పేర్కొనడం గమనార్హం. ఇప్పుడీ వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement