Tuesday, April 30, 2024

Big Story: ఊసేలేని గోరంట్ల బ్రిడ్జి నిర్మాణం.. మూడేళ్లుగా ఎదురుచూపు

కర్నూలు, ప్రభన్యూస్‌ బ్యూరో : అధికారాన్ని చేపట్టిన అరు నెలల్లో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసి, రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం… ఈ హామీ ఇచ్చింది ఎవరో కాదు… వై.యస్‌ జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ఇది.. అధికారంలోకి వచ్చి మూడున్నర ఎళ్లు గడుస్తున్నా.. బ్రిడ్జి నిర్మాణం పనుల ఉసేలేదు. కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ రెండు నియెజకవర్గాల సరిహాద్దు గ్రామాలైన గోరంట్ల నుంచి కోత్త పల్లె గ్రామాన్ని కలుపుతూ 15.88 కోట్ల రూపాయల బ్రిడ్జి నిర్మాణపు పనులకు కాంట్రాక్టర్లు కరువైపోయారు. 2020 నుంచి 2021 వరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

పది గ్రామాల ప్రజల దశబ్ధాల కల..

వై.యస్‌ జగన్‌ మెహాన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ముడున్నర ఎ్లళయినా అమలుకు నొచుకోలేదు. కోడుమూరు, పత్తికొండ నియెజకవర్గ పరిధిలోని 10 గ్రామాల ప్రజల దశబ్దాల కల ఆ బ్రిడ్జి నిర్మాణం. పత్తికొండ నియెజకవర్గలోని క్రిష్ణగిరి మండల పరిధిలోని 5 గ్రామాలు ఎర్రగుడి,కోత్తపల్లె, మన్నెంకుంట, ప్రజలు కోడుమూరు, కర్నూలుకు చేరుకొవాలంటే గోరంట్ల సమీపంలోని హంద్రీనదిని దాటాల్సిందే. గోరంట్ల గ్రామానికి చెందిన రైతులకు హంద్రీనది అవతలవైపు 3 వేల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఈ భూములు సాగుచేయాలంటే గోరంట్ల రైతులు హంద్రీనదిని దాటి తమ భూముల వద్దకు చేరుకొవాల్సిందే.

గోరంట్ల నుంచి కోత్తపల్లె ఈ రెండు గ్రామాల మధ్య హంద్రీనదిపై 340 మీటర్లు పోడువునా రాకపోకలు సాగిస్తుంటారు. రెండు నియెజకవర్గాలకు కీలకమైన ఈ హంద్రీనదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవటంతో క్రిష్ణగిరి మండలములో గ్రామాల విద్యార్థులు హైస్కూళ్లుకు చేరుకొవాలంటే..నది అవతలివైపు వరకు అటోలోవచ్చి.. హంద్రీనది దాటుకొని గోరంట్ల హైస్కూల్‌కు చేరుకొవాల్సి ఉంది. ఐదేళ్ల వయస్సు పిల్లవాని మెదలుకొని, వద్దులు, మహిళలు, హంద్రీనదిలో నీటి ప్రవాహాన్ని దాటుకొని అటు ఇటు రాకపోకలు సాగిస్తూ రోజూ ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు.

- Advertisement -

వర్షకాలంలో మరింత ఇబ్బందులు..

వర్షాకాలం ప్రారంభమైతే చాలు, నదికి ఆవిలపైపు ఉన్న గ్రామాల ప్రజలు త్రీవ భయాందోళనలకు గురవువుతారు. చిన్న చిన్న వర్షాలకు హంద్రీ నదిలో ప్రవహించే నీటిని దాటుకొంటూ ఎలాగో ఓడ్డుకు చేరుకొంటారు. అదే ఒక మెస్తారు భారీ వర్షాలు వరుసగా రెండు, మూడు రోజుల పాటు కురిస్తే.. ఇక నదికి ఇరువైపుల గ్రామాల ప్రజలు ఎక్కడిక్కడే ఉండి పోవాల్సిందే. అత్యవసరమైయితే మరో సూదూర మర్గం ద్వార చేరుకొక తప్పదు. కొన్ని సందర్బాలల్లో హంద్రీనదిలో నీటిని దాటేందుకు ప్రయత్నిస్తూ ఓ ఉపాధ్యాయుడు నీటి ప్రవాహాంలో కొట్టుకుపోతుండగా సాటి ఉపాధ్యాయుడు అప్రమత్తతో ప్రాణాలు కాపాడగలిగారు. హంద్రీనదికి అవతిలివైపు క్రిష్ణగిరి మండల పరిధిలోని 5 గ్రామాల ప్రజలు, కోడుమూరు, కర్నూలుకు చేరుకొవాలంటే హంద్రీనది మీదుగా 40 కి.మీ ప్రయాణించాల్సిఉంది.

అంటే హంద్రీనదిలో వరద నీటి ప్రవాహాం కొనసాగిన సమయంలో.. క్రిష్ణగిరి మండల 5 గ్రామాల ప్రజలు.. ప్రత్యామయంగా వెలుర్ది, మీదుగా కర్నూలుకు ప్రయాణించాలంటే సుమారు 70 కి.మీ ప్రయాణించాల్సి వస్తోంది. కొన్ని సందర్బాలల్లో రోగులను అసుపత్రికి తరలించే సమయంలో హస్పటల్‌ కు తీసుకుపోయేలోపు ప్రాణాలు గాలిలో కలసిన రోజులు ఉన్నాయి. అత్యవసర సమయాలల్లో రోగులను చికిత్స కోసం హాస్పటల్‌ కు తరలించే సమయంలో దారిలోనే ఇప్పటివరకు 5 మంది ప్రాణాలు కొల్పోయారు.మహిళల కష్టాలు ఇక చెప్పనవసరం లేదు. గర్బీణీ స్రీలను ప్రసవం కోసం ఆటోలో హస్పటల్స్‌కు తరలించే సమయంలో మధ్యలోనే ప్రసవాలు జరిగిన సందర్బాలు లేకపోలేదు.

రెండు నియోజక వర్గాలకు కీలకమైన గోరంట్ల వద్ద హంద్రీనదిపై వంతెన నిర్మాణం నేటి వరకు ఎటువంటి కొలిక్కిరావడం పట్ల ఈ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 2018లో అధికారంలో ఉన్న తెదేపా ఏపి రూరల్‌ రోడ్స్‌ కనెక్టీవిటీ ప్రాజెక్టు కింద గోరంట్ల నుంచి కోత్తపల్లే వరకు హంద్రీనదిపై 340 మీటర్ల పోడవునా వంతెన నిర్మాణంకు రూ. 12.37 కోట్లను మంజూరు చేశారు నిధులు మంజూరు చేసిన 6 నెలలకే ఎన్నికలు జరగడంతో వైసీపీ అధికారంలో వచ్చి పాలన పగ్గాలు చేపట్టింది.

ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ నేతృత్వంలో 2020 డిసెంబర్‌ 3న పంచాయితీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్‌లు ముందుకు రాకపోవడంతో రద్దు చేశారు. తిరిగి 2021 జూన్‌ 13న రెండవ సారి టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. మూడవ పిలుపులోను ఇదే పరిస్ధితి ఎదురైంది. ఇక నాల్గవ పిలుపులో రూ. 13.07 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 19 శాతం ఎక్సైస్‌కు సింగిల్‌ టెండర్‌ దాఖలు కావడంతో అధికారులు వీటిని రద్దు చేయక తప్పలేదు. ఇక ముచ్చటగా ఐదవసారి గతనెల 27న మరోసారి టెండర్లు పిలువడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement