Friday, May 17, 2024

AP: కనకదుర్గమ్మకు కానుకల వర్షం..

హుండీలో భారీగా కానుకలు చెల్లించుకున్న భక్తులు…
15 రోజులకు రెండు కోట్ల ఆదాయం..
400 గ్రాముల బంగారు, మూడు కేజీలకు పైగా బంగారం ..
విదేశీ డాలర్లు కూడా సమర్పించుకున్న భక్తులు..
(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారికి భక్తులు పెద్ద ఎత్తున మొక్కలు చెల్లించుకున్నారు. నిత్యం అమ్మవారి దర్శనానికి వచ్చే వేల సంఖ్యలో భక్తులు తమ శక్తి మేర బంగారం, వెండితో పాటు నగదును అమ్మవారికి కానుకలుగా చెల్లిస్తుంటారు. ఇదే సమయంలో దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు కూడా అమ్మవారికి కానుకగా పెద్ద ఎత్తున డాలర్లను సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని హుండీల లెక్కింపుని ఆలయ అధికారులు మంగళవారం చేపట్టారు. ఆలయంలోని మహా మండపం ఆరవ అంతస్తులో గడిచిన 15 రోజులకు సంబంధించిన హుండీల లెక్కింపును ఆలయ ఈవో కేఎస్ రామారావు సమక్షంలో నిర్వహించారు.

15రోజులకు సంబంధించిన హుండీల్లో లభించిన నగదు రూ.1,91,27,261లు ఉండగా, కానుకల రూపంలో బంగారం 370 గ్రాములు, వెండి 3 కేజీల 850 గ్రాములు భక్తులు హుండీ ద్వారా అమ్మవారికి కానుకలను సమర్పించుకున్నారు. అలాగే విదేశీ కరెన్సీ కి సంబంధించి యు ఎస్ ఏ 516 డాలర్లు, ఓమన్ 100 బైంసా, యు కే 20 పౌండ్లు, ఇంగ్లాండ్ 40 పౌండ్లు, ఆస్ట్రేలియా 100 డాలర్లు, కేనెడా 15 డాలర్లు, యూరో 5 యూరోలు, సింగపూర్ 2 డాలర్లు, యుఏఈ 25 దిర్హమ్స్, కువైట్ 1 దినార్, కతర్ 24 రియాల్స్, కొరియా 1000 వాన్ లను భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఆన్లైన్ ఈ హుండీ ద్వారా భక్తులు రూ. 44,831లు చెల్లించుకున్నారు. ఈ హుండీ లెక్కింపులో సహాయ కార్యనిర్వాహణాధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, భవాణీ సేవా దారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement