Friday, May 31, 2024

TS | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు నేడు (శుక్రవారం) విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టిక్కెట్లను బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఫొటో, సంతకం, పేరు, మీడియంతో పాటు రాస్తున్న సబ్జెక్టులను నోట్ చేసుకోవాలని, వాటిలో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు.

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. ఫ్రెషర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement