Monday, May 20, 2024

Open Letter బిజెపి అభ్య‌ర్ధుల‌కు మోదీ లేఖ‌

కాంగ్రెస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని పిలుపు
ఆ పార్టీ ప‌న్నాగాల‌ను ప్ర‌జ‌ల‌లోకి తీసుకెళ్లండి
ఉన్న రిజ‌ర్వేష‌న్ల కు గండి కొడుతూ
మ‌త‌ప‌ర‌మైన వాళ్ల‌కు ఇస్తున్న‌కాంగ్రెస్
అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్వ‌పార్టీ నేత‌ల‌కు సూచ‌న

న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి అలయన్స్ ప్రలజమధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసారు .కాబట్టి ఓటర్లను చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రతి అభ్యర్థిపై వుందన్నారు. ఎస్సి, ఎస్టి, ఓబిసి ల రిజర్వేషన్లు లాక్కుని వాటిని మ‌త‌ప‌ర‌మైన వారికి ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంద‌న్నారు… అందుకోసమే మతపరమైన రిజర్వేషన్లకు తెరలేపిందని అన్నారు. ఈ మేర‌కు బిజెపి అభ్యర్థులకు ప్రధాని నేడు ఓ లేఖ రాసారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ఈ లేఖ ద్వారా సూచించారు ..

ఆ లేఖ‌లో ఇలాంటివి రాజ్యాంగ విరుద్దమన్నారు. అంతేకాదు ప్రజలు కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడా లాక్కుని తమ ఓటుబ్యాంకుకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా పేర్కొన్నారు. వారసత్వ పన్ను వంటివి తీసుకువచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ కు వుందన్నారు. ఇలాంటివి జరక్కుండా వుండాలంటే దేశమంతా ఒక్కటి కావాల్సిన అవసరం వుందని ప్రధాని సూచించారు.

- Advertisement -

వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయ‌ని, … దీంతో పోలింగ్ రోజు ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడతార‌న్నారు. కానీ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవ‌ని అంటూ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యమ‌న్నారు. పోలింగ్ రోజు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎండ నుండి తప్పించుకోవచ్చని ఓటర్లకు సూచించారు.

బిజెపి నాయకులు, కార్యకర్తలు కూడా ఓటర్లును చైతన్యపర్చాలని… ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని ప్రధాని సూచించారు. ప్రతి బూత్ లో బిజెపిని గెలిపించేలా కృషిచేయాల‌న్నారు. … అప్పుడు ఆ లోక్ సభలో విజయం వరిస్తుంద‌ని అంటూ . ఇదే సమయంలో ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement